Chattam Review - Chattam movie review - Jagapati babu Chattam movie review With World cup cricket fever touching the maximum levels on temperature meter it is being very tough for films to survive at the box office. Despite the poor response from the audience, Chattam producers Natti kumar and Rama Satyanaraya are daring to release their films in this off season.
Rating: 2.5/5
Banner: Visakha Talkies
Cast: Jagapathi Babu, Vimala Raman
Direction: P.A. Arun Prasad
Music: MM Sreelekha
Producer: Tummalapalli Rama Satyanarayana, Natti Kumar
Chattam Review
సంవత్సరానికి పది సినిమాలు చేయాలని ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించుకుని వడివడిగా సినిమాలు చేసుకుంటూపోతున్న హోమ్లీ మాన్ జగపతిబాబు ఈ సంవత్సరం అప్పుడే రెండో సినిమా 'చట్టం' తో ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాఖ టాకీస్ బ్యానర్ ఫై నట్టికుమార్, రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. జగపతి బాబుతో విమలా రామన్ జోడికట్టిన ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, అజయ్ శర్మ, ఆశిష్ విద్యార్ధి తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతాన్ని అందించింది. జయం, పరాజయం వంటి భేదాలు లేకుండా వరసగా సినిమాలు చేస్తూ ఈ మద్యనే నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంటున్ననట్టికుమార్ జగపతి బాబుతో కలిసి 'చట్టం' నీ అబ్బ సొత్తా..? అని అవినీతి మాయ చట్టాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసాడు. చట్టంలోని లోపాలని, లొసుగులను నిలదీసే సినిమాలు, కడిగేసే సినిమాలు గతంలో చాలానే వచ్చాయి వాటితో పోలిస్తే ఈ సినిమా ఎంత వరుకు బిన్నంగా ఉందొ ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
పంజాగుట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ గౌరీ శంకర్( జగపతి బాబు) పెద్ద అవినీతి పరుడు. లంచాలుతీసుకుని వ్యవహారాలు నడిపించేస్తూ ఉంటాడు. ఒక రోజు స్వప్న అనే కాలేజీ స్టూడెంట్ మీద యాసిడ్ దాడి జరుగుతుంది. నిందితుడు పట్టుపడ్డా డబ్బు, అధికారం తో బయటపడతాడు, ఆ తరవాత అనుకోకుండా ఓ గుర్తు తెలియని వ్యక్తిచే చంపబడతాడు. అతని తండ్రి పెద్ద వ్యాపారవేత్త అవటంతో సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తారు. కేసు విచారణలో ఉండగానే వైశాలి అనే బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన హంతకులను కూడా చంపేస్తాడు ఆ ఆగంతకుడు. కాస్త తెలివిగా వ్యవహరించిన సిఐడి అధికారి(అజయ్ శర్మ) ఆ గుర్తు తెలియని వ్యక్తిని కనిపెడతాడు. అతను వేరెవరో కాదు గౌరీ శంకర్ అని తెలుస్తుది. అప్పటికే ముంబై వెళ్ళిపోయిన గౌరీశంకర్ అక్కడ అమ్మాయిల రవాణాముఠా ను అంతమొందిస్తూ ముంబై పోలీసులకు చిక్కుతాడు. అతన్ని ముంబై దాడులకు కారణమైన హసన్ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని ఉంచిన జైలులో ఉంచుతారు. ఇదంతా గౌరీ శంకర్ ప్లాన్ చేసుకుని హసన్ ను చంపటానికి వేసిన పధకం అని తెలుస్తుంది సిఐడి అధికారికి. అసలు గౌరీ శంకర్ హస్సన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు...? చివరకి చంపగలిగాడా, లేదా ..? అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
ఇలాంటి కధలు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కాకపోతే ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గత కొంతకాలంగా పబ్లిక్ లో ఉన్న ప్రముఖమైన వార్తలను ఆధారంగా చేసుకుని కధను అల్లుకున్నారు. వరంగల్ యాసిడ్ దాడి, విజయవాడ వైష్ణవి కిడ్నాప్ హత్య, జైలు లో ఉన్న పాకిస్తానీ తీవ్రవాది కసబ్ సంఘటనలను ప్రధానంగా తీసుకుని చట్టం లోని లొసుగులను చూపిస్తూ.. ఎప్పటికి సాధ్యపడని ఓ సినిమాటిక్ పరిష్కారాన్ని చూపించారు. అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఆవేశం మాత్రమే ఉంటే సరిపోదు అవగాహన, ఆలోచన కూడా ఉండాలి. దర్శకుడు అరుణ్ ప్రసాద్ కొన్ని సన్నివేశాలను పట్టు సడలకుండా చిత్రీకరించినా చివరికి సినిమాను రొటీన్ గా ముగించడం తో తేలిపోయినట్టు అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించదు, అన్నింటిని ఎక్కడెక్కడి నుండో అరువు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. చివరికి కధ కూడా రొజూ పేపర్ చదువుతూ తయారు చేసుకున్నట్టు ఉంది. శ్రీ లేఖ పాటల సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. కాకపోతే బ్యాక్ స్కోరు పరవాలేదనిపిస్తుంది. కెమెరా మొదలు అన్ని విభాగాలు నాణ్యత పరంగా కాస్త తక్కువ స్థాయిలో ఉన్నాయి.
జగపతి బాబు కు పోలీసు వేషాలు కొత్త కాకపోయినా ఈ సినిమాలో కొంచెం విభిన్నంగా కనిపించడమే కాక తన సహజ శైలిలో నటించాడు. కాకపోతే జగపతి బాబు, గీతాసింగ్ ల ఫై చేసిన పేరడీ పరమార్ధమేమిటో అర్ధం కాలేదు. విమలారామన్ పాత్ర నిడివి తక్కువగాను, పెద్ద అవసరం లేనిదిగాను కనిపిస్తుంది. జగపతిబాబు, విమల రామన్ జోడి తాజా గా ఏజ్ బార్ అయిన యువ జంట మాదిరి ముచ్చటగా ఉంది. అజయ్ శర్మ, ఆశిష్ విద్యార్ది, జీవా, రావ్ రమేష్ తమ పాత్రలకు అనుగుణంగా చక్కగా నటించారు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేర బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్:
యదార్ధ సంఘటనలతో అల్లుకున్న కధ, జగపతి బాబు నటన ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్ :
రొటీన్ క్లైమాక్స్, గ్రిప్పింగ్ మిస్ అయిన రెండో సగం, కామెడీ లేక పోవడం, ఆకట్టుకునే పాటలు లేక పోవడం తదితర అంశాలు చట్టం సినిమాకు సంబంధించి మైనస్ పాయింట్స్.
కొస మెరుపు:
చట్టం సినిమాకు నీ అబ్బ సొత్తా..? అనే సబ్ టైటిల్ పెట్టారు. సినిమా చుసిన తరవాత ఆ సబ్ టైటిల్ హీరోకు వర్తిస్తుందో లేదా విలన్లకు వర్తిస్తుందో అర్ధంకాదు.
రేటింగ్: 2.5 / 5
బ్యానర్: విశాఖ టాకీస్
తారాగణం: జగపతి బాబు, విమలా రామన్
దర్శకత్వం: అరుణ్ ప్రసాద్
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
నిర్మాత: నట్టికుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ
0 comments:
Post a Comment